బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా చేయడం మా లక్ష్యమని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. మంగళవారం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ తూముకుంట నర్సారెడ్డి రాష్ట్ర నాయకుల నాయకుడు చిటుకుల మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి సొసైటీ అధ్యక్షుడు మెట్టు బాలకృష్ణారెడ్డి సొసైటీ డైరెక్టర్ తదితరులు మైనంపల్లి హనుమంతరావు సమక్షం లో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన అరాచకాలను ఎండగట్టి ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ రిజల్ట్ చూపిస్తామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు మండలంలో పూర్తిస్థాయిలో లేకుండా చూడాలని అన్నారు