తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

-

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత స్పీకర్ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తండ్రి శ్రీపాదరావు జయంతి వేడుకలని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జయంతి వేడుకలను శనివారం అసెంబ్లీలో నిర్వహించారు అయితే ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ ఆలస్యమైన శ్రీపాదరావు జయంతి వేడుకలు అధికారికంగా జరపడం సంతోషంగా ఉందని చెప్పారు నక్సల్స్ దాడిలో చనిపోయిన శ్రీపాదరావు అజాతశత్రువు అని అన్నారు ఎస్ ఎస్ యు ఐ లో ఉన్నప్పటినుండి శ్రీపాదరావుతో తనకి అనుబంధం ఉందని కోమటిరెడ్డి గుర్తు చేశారు శ్రీపాదరావు పేరుని ఆయన కొడుకు మంత్రులు శ్రీధర్ బాబు నిలబెడుతున్నారని చెప్పారు

Read more RELATED
Recommended to you

Latest news