మేడిగడ్డపై కాంగ్రెస్ సర్కారు కుట్రలు ?

-

మేడిగడ్డపై కాంగ్రెస్ సర్కారు పగబట్టిందంటూ బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. మేడిగడ్డ పై సర్కారు పగబట్టిందా.. బ్యారేజీలో కుంగిన 20వ పియర్‌ను ఇంకా దెబ్బతీసే కుట్ర జరుగుతోందా అంటే నిజమేనని అనిపిస్తోందంటూ ఓ వీడియో వైరల్‌ చేస్తోంది బీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ మీడియా. అన్నారం గేట్లు ఎత్తడానికి ముందు 5, 6 బ్లాకుల నుంచి పారిన నీళ్లు.. రెండు వారాలుగా దెబ్బతిన్న 20 పియర్ నుంచే కిందకు వెళ్తున్నాయి.

Medigadda Barrage

పియర్ కింది నుంచి లీకేజీలను పెంచి దెబ్బతిన్న ఏడో బ్లాకును కూలిపోయేలా చేసే కుట్రకు ఇది సాక్ష్యంగా నిలుస్తోందంటూ వీడియో వైరల్‌ చేశారు. ఇక అటు మేడిగడ్డ ఎఫెక్ట్..రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రమాదంలో పడింది. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం ఎరువుల కర్మాగారం ప్రాజెక్టుపై మేడిగడ్డ ప్రాజెక్టు ఎఫెక్ట్ పడింది.మరో రెండు నెలల్లో రామగుండం ఎరువుల కర్మాగారానికి నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని సమాచారం. ఈ తరుణంలోనే మే నెల నుంచి ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఇరిగేషన్ అధికారులు లేఖ రాశారట.

Read more RELATED
Recommended to you

Latest news