మీరు ఒక్క మాట చెప్తే చాలు.. మోడీ కి రేవంత్ రిక్వెస్ట్..!

-

అదిలాబాద్ జిల్లాకి నీళ్లు అందించాలంటే తమ్ముడిహట్టి దగ్గర సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర లో కేవలం 1850 ఎకరాల భూమి మాత్రమే అవసరమని అన్నారు. తమ్ముడిహట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మిస్తే ఏ గ్రామం మునిగిపోదు ఎవరికీ నష్టం కూడా ఉండదు ఒకవేళ ఎవరైనా నష్టపోయిన నష్టపరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

cm revanth

దీంతో రేవంత్ రెడ్డి మోడీని ఉద్దేశిస్తూ ఒక్క మాట చెప్తే మహారాష్ట్ర అంగీకరిస్తుందని అన్నారు మోడీ ని రిక్వెస్ట్ చేశారు. సోమవారం ప్రధాని మోడీ తెలంగాణ లోని ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా దాదాపు 7వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మోడీని రిక్వెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి విజ్ఞప్తికి మోడీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news