సచివాలయం కూడా తాకట్టు పెట్టేసారన్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెశారు నూజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని.. తాకట్టు పెట్టకుండా బ్యాంకులు అప్పులు ఎలా ఇస్తాయి..? అని ప్రశ్నించారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నాడు.. నేడు రాష్ట్రం అప్పులు 4 లక్షల కోట్ల రూపాయలు ఉంటే.. అందులో 2.50 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు చేసినవే అని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండానే.. చంద్రబాబు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారా? అని నిలదీశారు.
ప్రజలకు అవసరమైనప్పుడు.. ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలే అన్నారు. సచివాలయం అనేది పది ఎకరాల ఆస్తి మాత్రమే.. ప్రత్యేకించి ఏ ఆస్తులు తాకట్టు పెట్టాలో అనే విషయం రాజ్యాంగంలో ఏమైనా రాశారా..? అంటూ విషయం రాజ్యాంగంలో ఏమైనా రాశారా..? అంటూ ప్రశ్నించారు. ప్రజల అవసరాల కోసం.. ప్రభుత్వ వేసులుబాటును బట్టే ఆస్తులు తాకట్టు పెట్టడం జరుగుతుందన్నారు. చిల్లర రాజకీయ నాయకుడు అంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబు చేస్తేనే సంసారం.. మిగతా వాళ్లు చేస్తే కాదన్నట్టుగా ఆయన వ్యవహారం ఉంటుందంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని.