అనన్య నాగళ్ళ మల్లేశం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటించి క్రేజ్ ని పెంచుకుంది. తర్వాత వరస అవకాశాలు రావడంతో ప్రేక్షకులకి దగ్గరవుతోంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫొటోస్ ని పంచుకుంటూ ఉంటుంది. ప్రస్తుతం అనన్య తంత్ర మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. హారర్ బ్యాక్ గ్రౌండ్ తెరకెక్కిన ఈ మూవీ మార్చి 15న గ్రాండ్ గా రిలీజ్ అవ్వనుంది.
సినిమా రిలీజ్ దగ్గర పడడంతో అనన్య వరస ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. అనన్యని రీతు చౌదరి ఎవరు ఇండియా ప్రెసిడెంట్ అని అడుగుతుంది. దానికి ఆమె ఓ మై గాడ్ అని అంటుంది. అక్కడున్న స్టూడెంట్స్ ని చెప్పమని అంటుంది వారు చెప్పకుండా నవ్వుతూ ఉండడంతో ఆమె పేరు మర్చిపోయాను అని అంటుంది ఈ వీడియో వేయకండి మళ్లీ వైరల్ అయిపోతుంది నాకు ఈ సెగ్మెంట్ ఉందని తెలియదు మాస్టర్ నేను వెళ్ళిపోతాను అని ఫన్నీగా అంటుంది. ఇది చూసిన వాళ్ళందరూ అనన్య పరువు తీసేసిందిగా అని అంటున్నారు.