సీఎం జగన్ మీద టీడీపీ సోషల్ మీడియా విభాగం అసభ్యకరమైన పోస్టులు పెడుతోందని అందిన కంప్లైంట్ మేరకు సీఈఓ ముకేశ్ కుమార్ స్పందించారు. 24 గంటల్లో పోస్టులు తొలగించాలని ఆదేశించారు. ఫిర్యాదు మేరకు మాజీ సీఎం చంద్రబాబుకి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది, టిడిపి అధినేత చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఈసీ కి కంప్లైంట్ చేశారు దీనిపై సీఈవో స్పందిస్తూ నోటీసులని పంపించారు.
టిడిపి సోషల్ మీడియా విభాగం పోస్టులు ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని 24 గంటల్లోగా జగన్ పై పెట్టిన అసభ్యకరమైన పోస్టులను తొలగించాలని ఆదేశించారు. ఆదివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేట లో జరిగిన ఎన్డీఏ కూటమి సభలో పాల్గొన్న మోడీ ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించారని ఏపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు భారత వాయిసేన హెలికాప్టర్ ని ఉపయోగించారని టీఎంసీ ఎంపీ సాకేత్ గోకుల కంప్లైంట్ చేశారు.