కుమారి ఆంటీ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు కొంతకాలం నుండి సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింది కుమారి ఆంటీ. మీది మొత్తం వెయ్యి అయింది. రెండు లివర్స్ ఎక్స్ట్రా అనే డైలాగ్ తో రీల్స్ కూడా చేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా ఈమె వెళ్లారు. ఈమె ఫేమస్ అయినప్పటి నుండి పలు ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతున్నారు. సినిమా రేంజ్ లో కార్తీకదీపం చరిత్రలోనే తొలిసారి ఈ సీరియల్ కి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. అక్కడకు కుమారి ఆంటీ వెళ్లారు. ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ చేశారు రేవంత్ రెడ్డి స్పందించిన తర్వాత ఆమె వ్యాపారం ఎలా ఉందని అడిగారు.
సీరియల్స్ లో మూవీస్ లో ఛాన్స్ లు ఏమైనా వచ్చాయా అని అడిగారు. కుమారి ఆంటీ మాట్లాడుతూ మా పిల్లలు చెప్పడంతో సీరియల్స్ లో నటించాను అంతకు ముందు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పాల్గొన్నాన ని చెప్పారు. రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి కానీ బిజినెస్ చూసుకోవాలి కాబట్టి వద్దని చెప్పేశానని ఆమె అన్నారు. అయితే ఈ రెండు సినిమాలు చిరంజీవి బాలకృష్ణ సినిమాలని అంటున్నారు.