టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కెరియర్ మంచి పీక్స్ లో ఉన్న టైంలో మయాసిటీస్ కారణంగా ఇండస్ట్రీకి పెద్ద బ్రేక్ ఇచ్చింది. అయినప్పటికీ ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకి సంబంధించిన విషయాలని పంచుకుంటూ అభిమానులకి దగ్గరగానే ఉంటోంది. అనారోగ్యం నుండి కోలుకున్న సమంత ఇప్పుడిప్పుడే మూవీస్ లో బిజీ అవుతోంది. తాజాగా సమంత రెమ్యూనరేషన్ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది.
ఏడదిగా సినిమాలు చేయకపోయినా రెమ్యునెరేషన్ లో మాత్రం అసలు తగ్గట్లేదు అని తెలుస్తోంది వడ్డీతో కలిపి మరీ నిర్మాతల నుండి వసూలు చేయాలని సమంత ఫిక్స్ అయిపోయింది. తెలుగులో ఖుషి తర్వాత సమంత ఇక ఏ సినిమా కూడా చేయలేదు. బాలీవుడ్ లో మాత్రం బిజీ గా ఉంది. వరుణ్ ధవన్ హీరోగా వచ్చిన ఈ సిరీస్ కి సమంత ఏకంగా 10 కోట్ల పారితోషకం తీసుకుంది యాడ్స్ కి కూడా భారీగానే తీసుకుంటోంది నిర్మాతలు కూడా ఈమె రెమ్యునెరేషన్ విషయంలో వెనకాడట్లేదు