తగ్గేదేలే.. సౌత్ ఇండియా నుంచి తొలి హీరోగా అల్లు అర్జున్ క్రేజీ రికార్డ్

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ హీరో నటన, డ్యాన్స్, స్టైల్ అంటే ఫ్యాన్స్ ఇష్టపడుతుంటారు. బన్నీ యాక్టింగ్, డ్యాన్స్, స్టైల్ అంటే ఫ్యాన్స్ పడిచచ్చిపోతారు. పుష్ప మూవీ తర్వాత బన్నీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. నార్త్లోనూ ఈ సినిమాతో అల్లు అర్జున్కు పెద్ద ఫ్యాన్డమ్ ఏర్పడింది. ఈ మూవీతో అల్లు అర్జున్ ఫాలోయింగ్ ఎంతగా పెరిగిందంటే మాటల్లో చెప్పలేం.

తాజాగా బన్నీ మరో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్లో 25 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. దీంతో సౌత్ ఇండియా హీరోలెవరికీ సాధ్యం కానీ ఫీట్ను సాధించాడు. క్షిణాదిలో 25మిలియన్ల ఫాలోవర్స్ను కలిగిన మొదటి హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేశాడు. తర్వాత స్థానంలో 21.3 మిలియన్లతో విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ 20.8. దుల్కర్ సల్మాన్ 14.1, 11.7 ప్రభాస్, 10.8 మిలియన్లతో దళపతి విజయ్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news