టాలీవుడ్‌ లో మరో విషాదం…టక్‌ జగదీష్‌ విలన్‌ మృతి

-

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖ నటీనటులు మృతి చెందారు. అయితే తాజాగా మరో కీలక నటుడు మరణించారు. ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూశారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు వెల్లడించారు.

tuck jagadish villain Daniel Balaji is no more

వెట్ట యాడు విలయాడు, వడా చెన్నై లాంటి సినిమాలలో ఆయన కీలక పాత్రలు పోషించారు. ఇక తెలుగులో సాంబ, ఘర్షణ, చిరుత మరియు టక్ జగదీష్ సినిమాలలో విలన్ గా పని చేశారు బాలాజీ. ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేశారు. తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖులు అలాగే అభిమానులు బాలాజీకి నివాళులు అర్పిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news