ఇండియా తరుపున T20 ప్రపంచకప్ జట్టులోకి వచ్చేనా?

-

రాజస్థాన్ రాయల్స్ యంగ్ బ్యాటర్ రియాన్ పరాగ్ వీర విహారం చేస్తున్నారు. గత సీజన్లో విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఈసారి మాత్రం పరాగ్ 2.0 అన్నట్లుగా చెలరేగుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లో  లక్నో సూపర్ జెయింట్స్ పై 43(29), ఢిల్లీ క్యాపిటల్స్ పై 84*(45), ముంబై ఇండియన్స్ పై 54*(39), గుజరాత్ టైటాన్స్ పై 76(48) పరుగులు చేసి రాణించారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై (4) మాత్రం ఫెయిలయ్యారు. 261 పరుగులతో టాప్ 2 స్కోరర్గా ఉన్నారు. T20 ప్రపంచకప్ కోసం ఇండియా జట్టులో చోటు దక్కించుకుంటారో లేదో చూడాలి మరి.

కాగా, నిన్న రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో ఈ సీజన్ నెంబర్ వన్ జట్టును గుజరాత్ టైటాన్స్ మట్టి కల్పించింది. రాజస్థాన్ ఓపెనర్లు తొలి వికెట్ కు 32 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఈ క్రమంలో జైస్వాల్ 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.ఆ తర్వాత కాసేపటికి ఎనిమిది పరుగులకి ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ కూడా రషీద్ ఖాన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సంజు సాంసన్, రియాన్ పరాగ్ మూడో వికెట్ కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.కెప్టెన్ సంజు సాంసన్ 67 రన్స్ చేయగా, రియాన్ పరాగ్ 76 పరుగులతో రాణించాడు.

Read more RELATED
Recommended to you

Latest news