Pushpa 2 :ఇండస్ట్రీ షేక్ అయ్యే న్యూస్ ఇది..పుష్ప 2 మూవీలో పవర్ స్టార్

-

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ..ఇప్పుడు మరోవార్త ఇండస్ట్రీని షేక్ చేస్తుంది.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో భాగం కానున్నారట.. మూవీలో నటిస్తున్నారా? అనే సందేహం వస్తుంది కదూ.. నిజానికి ఈ చిత్రంలో హీరోని ఇంట్రడ్యూస్ చేస్తూ మొదట్లో కొన్ని డైలాగులను పవన్ కళ్యాణ్ చెప్పబోతున్నారట.. పవన్ వాయిస్ ను ఇవ్వనున్నారని నెట్టింట్లా ఓ వార్త చక్కర్లు కొడుతున్నాయి.. ఇక ఇటీవల అల్లు అర్జున్ కి పుట్టిన రోజు విషెస్ చెబుతూ పవన్ కళ్యాణ్ ఎక్స్(ట్విట్టర్) లో ట్వీట్ ని కూడా చేశారు..ఈ సినిమాకు మరింత హైప్ ను క్రియేట్ చేసేందుకు డైరెక్టర్ సుకుమార్ పవన్ కళ్యాణ్ ను దించబోతున్నారని సమాచారం.. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.. ఏది ఏమైన ఈ వార్త అల్లు అర్జున్ అభిమానుల కు సంతోషాన్ని ఇస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news