కామారెడ్డి జిల్లా నెమ్లి గ్రామంలో ఓటర్ల పేరుతో వేసిన ఫ్లెక్సీ ప్రస్తుతం వైరల్ అవుతోంది. వాట్సాప్ లో దీనిని విపరీతంగా షేర్ చేస్తున్నారు దీంతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వచ్చే రాజకీయ పార్టీలు వాళ్ళని నాయకులని ఆలోచింపచేస్తోంది. ఉచిత పథకాలు గ్యారెంటీలు ప్రకటించిన పార్టీలకి వీరి ప్రచారం కచ్చితంగా షాక్ ఇస్తుంది.
ప్రధానంగా ఈ ఫ్లెక్సీలో పనికిమాలిన ఉచిత పథకాలు వద్దని దేశభద్రత కావాలని దేశభద్రత కోసం ఎన్ఆర్సి ఎన్ఎఎ అమలు చేయాలని సనాతన హిందూ ధర్మా పరిరక్షణకు హిందూ ఆలయ రక్షణ కోసం హిందూ ధార్మిక పరిస్థితి ఏర్పాటు చేయాలని, బలవంతపు మతమార్పిడి నిరోధక చట్టం కావాలని అన్నదాతల ఆత్మహత్యలు లేని వ్యవసాయ విధానాలు రావాలని ఈ ఫ్లెక్సీలో ఉంది.