49 ఏళ్ల మల్లిక షెరావత్… ఫిట్ బాడీకి ఆమె పాటించే ఆహార రహస్యాలు ఇవే!

-

వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అని నిరూపిస్తున్న బాలీవుడ్ బ్యూటీ మల్లిక షెరావత్. 49 ఏళ్ల వయసులో కూడా ఆమె టోన్డ్ ఫిజిక్, మెరిసే చర్మం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆమె ఫిట్‌నెస్ సీక్రెట్ అంతా యోగా, కఠినమైన వర్కౌట్స్‌లో మాత్రమే లేదు, ఆమె పాటించే ప్రత్యేక ఆహార రహస్యాల్లోనూ ఉంది. అనారోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా వుంటూ యవ్వనాన్ని నిలుపుకుంటున్న ఆమె డైట్ ప్లాన్ ఏంటో చూద్దాం..

వీగన్ డైటే ఆమె ఆరోగ్య రహస్యం: మల్లికా షెరావత్ ఫిట్‌నెస్ వెనుక ఉన్న అతిపెద్ద రహస్యం ఆమె పాటించే ‘వీగన్ డైట్’ (Vegan Diet). ఆమె గత పదేళ్లుగా పూర్తిగా వీగన్‌గా మారిపోయింది. అంటే పాల ఉత్పత్తులు (పాలు, పెరుగు, పన్నీర్, చీజ్), మాంసాహారంతో సహా జంతువుల నుండి వచ్చే ఏ ఆహారాన్ని కూడా ఆమె తీసుకోదు. వీగన్ ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో విషపదార్థాలు చేరవు, జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది మరియు వయసు పెరిగే ప్రక్రియ నెమ్మదిస్తుంది అని ఆమె దృఢంగా నమ్ముతుంది.

ప్రతిరోజూ ఉదయం ఆమె గోరువెచ్చని నీరు, నిమ్మరసంతో తన రోజును ప్రారంభిస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో పండ్లు, ముఖ్యంగా మామిడి పండ్లను అధికంగా తీసుకుంటుంది. లంచ్ లేదా డిన్నర్‌లో ఇంటి వద్ద తయారుచేసిన తాజా సలాడ్‌లు, కూరగాయల వంటకాలు, అవకాడో, కొబ్బరి పాలతో చేసిన థాయ్ గ్రీన్ కర్రీ వంటి సాత్విక ఆహారానికి ప్రాధాన్యత ఇస్తుంది. రొట్టె (గోధుమలకు), టీ, కాఫీలకు దూరంగా ఉంటుంది.

Mallika Sherawat at 49: Revealing the Secrets to Her Fitness and Diet!
Mallika Sherawat at 49: Revealing the Secrets to Her Fitness and Diet!

గ్లూటెన్ దూరం, సహజ స్వీట్స్ దగ్గరం: మల్లిక తన ఆహారంలో గ్లూటెన్‌ (Gluten)ను పూర్తిగా తొలగించింది అందుకే ఆమె రొట్టె లేదా గోధుమ ఉత్పత్తులు తినదు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి శరీరాన్ని తేలికగా ఉంచడానికి దోహదపడుతుంది. స్వీట్స్ తినాలనిపించినప్పుడు కేవలం ఖర్జూరాలను (Dates) మాత్రమే తీసుకుంటుంది. వీటితో పాటు శక్తి కోసం డ్రై ఫ్రూట్స్ మరియు నట్స్‌ను స్నాక్స్‌గా తీసుకుంటుంది. ప్యాకేజ్డ్ లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలను కనీసం కూడా ముట్టుకోకుండా ఇంట్లో వండిన తాజా ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వడం ఆమె ఫిట్‌నెస్ మంత్రం.

మల్లికా షెరావత్ జీవనశైలిని పరిశీలిస్తే, ఫిట్‌నెస్ అనేది జిమ్‌లో చేసే కఠినమైన వ్యాయామాలతో పాటు, కిచెన్‌లో పాటించే క్రమశిక్షణపై కూడా ఆధారపడి ఉంటుందని అర్థమవుతుంది. వీగన్ ఆహారం, క్రమం తప్పని యోగా మరియు స్వీయ-సంరక్షణ పద్ధతులతో, ఆమె వయసును లెక్క చేయకుండా యవ్వనంగా శక్తివంతంగా కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news