గోవా ఎప్పుడైనా చూడొచ్చు.. ఇప్పటికైతే ఉల్లిపాయలే కావాలి..

-

దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉల్లిపాయలు హాట్ టాపిక్. ఎందుకంటే ఉల్లి పాయ‌లు స‌హ‌జంగా కోసేట‌ప్పుడే క‌న్నీళ్లు పెట్టిస్తాయి.. కానీ ఇప్పుడు కొనేట‌ప్పులు కూడా క‌న్నిళ్లు పెట్టుస్తున్నాయి. ధర చుక్కల నంటడమే ఇందుకు కారణం. ఈ ఏడాది ఉల్లి ధర రూ.200 మార్కు చూసేసింది. కొన్ని రాష్ట్రాల్లో అంతకంటే ఎక్కువ ధర పలికింది. ఈ క్ర‌మంలో ఓ ఆన్ లైన్ బస్సు సర్వీస్ సంస్థ సరదాగా మీకు ఉల్లిపాయలు కావాలా..? గోవా ట్రిప్‌ కావాలా..? అంటే 50 శాతం మందికి పైగా ఉల్లిపాయలను ఎంచుకోవడంతో ఆ సంస్థ ఆశ్చర్యంలో మునిగిపోయింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ‘అభి బస్.కామ్’ గోవా కేంద్రంగా ఆన్ లైన్ బస్సు సర్వీసులను నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఉల్లి ధరల కారణంగా సామాజిక మాధ్యమాల్లో వస్తున్న జోక్స్, మీమ్స్ చూసి తమ ప్రయాణికులకు ఉల్లిపాయలు గెల్చుకునే పోటీ నిర్వహించాలని భావించింది. దీని కోసం `డిసెంబర 10 నుంచి 15వ తేదీ వరకు ఎవరైతే తమ సంస్థలో టికెట్ బుక్ చేసుకుంటారో వారికి కొన్ని ఆఫర్లు ఇస్తున్నాం` అని ఆఫ‌ర్ చేశారు. అలా ఇచ్చిన ఆఫర్లలో గోవా ట్రిప్, ఐఫోన్, ఈ-బైక్ తోపాటు మూడు కేజీల ఉల్లిపాయలను కూడా ప్రకటించింది.

ఇందులో ఏదో ఒకదాన్ని ప్రయాణికులు ఎంచుకోవచ్చు. ఇక్క‌డ‌ ఆశ్చర్యం ఏంటంటే.. టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుల్లో 56 శాతం మంది ఉల్లిపాయలను ఎంచుకోవడంతో ఆ సంస్థ షాక్‌కు గురైంది. ఇక చేసేదేమి లేక ఈ సంస్థ తన ప్రయాణికుల్లో ప్రతిరోజూ 20 మందిని ఎంపిక చేసి మూడు కేజీలు చొప్పున ఉల్లిపాయలు అందజేస్తోంది. ఏదేమైన దీనిని బ‌ట్టీ ఉల్లిపాయ‌ల‌కు ఎంత డిమాంగ్ ఉందో స్ప‌ష్టంగా అర్థం అవుతుంద‌ని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news