ఫరియా అబ్దుల్లా దగ్గరికి వస్తుంటే నాకు టెన్షన్ వస్తుంది : నాని

-

‘ఆ ఒక్కటి అడక్కు’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా హైట్ పై హీరో నానీ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఫరియా దగ్గరికి వస్తుంటే తనకు టెన్షన్ వస్తుందన్నారు. నరేశ్, ఫరియాకు క్లోజప్ షాట్ పెడితే తాను స్కీన్లో కనపడనని నాని ఫన్నీగా మాట్లాడారు. మధ్యలో యాంకర్ సుమ కలగజేసుకుని వారిద్దరూ మనల్ని తల ఎత్తుకునేలా చేస్తున్నారని నవ్వులు పూయించారు. ఇక చిత్ర బృందానికి నాని ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.

కాగా, ఈ మూవీలో నరేశ్ పంచ్లు, కామెడీ టైమింగ్ సినిమాపై అంచనాలను పెంచాయి. మల్లి అంకం డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రాజీవ్ చిలక నిర్మించగా.. వేసవి కానుకగా మే 3న విడుదల కానుంది.ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో వెన్నల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ చిలకా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం సమకూరుస్తున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news