కేసీఆర్ అవినీతిపై అమిషాతో ఈటల ఎందుకు విచారణ చేయించలే : రేవంత్ రెడ్డి

-

ప్రధాని నరేంద్ర మోడీ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిల విమర్శలు చేశారు.ఐదేళ్లలో ప్రధాని మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆకలి ఇండెక్స్ లో 125 దేశాల్లో భారతదేశం 111వ స్థానంలో ఉందని.. ఇది మోదీ పాలనకు నిదర్శనమని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… బీజేపీకి చెప్పుకునేందుకు ఏమీ లేదని.. పదేళ్లలో మోదీ పేదలను ఆదుకున్నది లేదు.. ఇండ్లిచ్చింది లేదని విమర్శించారు.

హుజూరాబాద్ కు మోదీ నుంచి ఈటల రాజేందర్ ఎన్ని నిధులు తీసుకొచ్చారు అని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై అమిషాతో ఈటల ఎందుకు విచారణ చేయించలే అని నిలదీశారు.కేసీఆర్ అవినీతిపై ఈటల కేంద్రానికి ఒక్క ఫిర్యాదైనా చేశారా..కేసీఆర్ అవినీతిపై, ఫోన్ ట్యాపింగ్ పై ఈటల ఎందుకు మాట్లాడుతలేడు.కేసిఆర్, ఈటలకు మధ్య ఉన్న ఒప్పందం ఏంటని ఆయన విమర్శించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news