Kondagattu temple: కొండగట్టు దేవస్థానంలో అర్చకుల అక్రమ వసూళ్లు దందా కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు దేవస్థానంలో అర్చకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులకు ఇబ్బందులు, సాధారణ భక్తుల దర్శనంకు ఆటంకాలు కలిగిస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేశారు అధికారులు.
ఈ తరుణంలోనే అంజన్న సన్నిధిలో అక్రమ వసూళ్లు చేస్తూ … విఐపి దర్శనాల దందా చేస్తున్నారు కొందరు అర్చకులు. వీఐపీలు రాగానే… గర్భ గుడికి సంబంధం లేని ఓ అర్చకుడి హడావుడి చేశాడు. ఆర్జిత సేవలు లేనప్పుడు ప్రత్యేక పూజలు, దర్శనాలు ఏంటని..ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఇక అర్చకుల వ్యవహారాన్ని చోద్యం చూస్తున్నారు అధికారులు. మొత్తానికి ఈ వ్యవహారంతో భక్తులు.. ఇబ్బందులు పడుతున్నారు.