ఉత్తరప్రదేశ్ హర్దోయ్ జిల్లా లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక వివరాల లోకి వెళితే.. పట్టాల సమీపం లో ఒక బాలుడు ఆడుకుంటున్నాడు. అయితే ఆ బాలుడు అక్కడే ఆగి ఉన్న గూడ్స్ రైలు ఎక్కాడు. అయితే వెంటనే అది కదలడం తో దిగలేక అక్కడే బిక్కుబిక్కుమంటూ ఆ బాలుడు ఉండిపోయాడు.
రైలు చక్రాల మధ్య ఇరుక్కుని 100 కి.మీ ప్రయాణించిన బాలుడు
ఉత్తరప్రదేశ్ – హర్దోయ్ జిల్లాలో పట్టాల సమీపంలో ఆడుకుంటున్న బాలుడు అక్కడే ఆగి ఉన్న గూడ్స్ రైలు ఎక్కాడు.. వెంటనే అది కదలడంతో దిగలేక అక్కడే బిక్కుబిక్కుమంటూ ఉండిపోయాడు.
గమనించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ హర్డోయ్లో బాలుడిని… pic.twitter.com/0CYAyuygk7
— Telugu Scribe (@TeluguScribe) April 23, 2024
రైలు చక్రాల మధ్య ఇరుక్కుని ఆ బాలుడు 100 కి.మీ ప్రయాణించాడు. అయితే గమనించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ హర్డోయ్ లో బాలుడి ని రక్షించారు. బాలుడు సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది. అదృష్టం కొద్ది రైలు చక్రాల మధ్య ఇరుక్కున్న బాలుడి కి ఏమి కాలేదు. సురక్షితంగా ఉన్నట్లే తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చేసిన పనికి అందరూ మెచ్చుకుంటున్నారు బాలుడుని రక్షించినందుకు సంతోషపడుతున్నారు.