మనీలాండరింగ్ ఆరోపణల మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనని అరెస్ట్ చేయడానికి సవాల్ చేస్తూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు జార్ఖండ్ హైకోర్టు తన పిటీషన్ పై ఫిబ్రవరిలో విచారణ పూర్తి చేసిన నిర్ణయాన్ని ప్రకటించలేదని పేర్కొన్నారు. ఫిబ్రవరి 28న హైకోర్టు నిర్ణయాన్ని రిజర్వ్ చేసిందని ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హేమంత్ సోరెన్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ వినిపించగా ప్రధాన న్యాయమూర్తి సెక్రటేరియట్ కి తెలియజేయాలని కోరారు.
హేమంత్ సోరెన్ మనీ ల్యాండ్రింగ్ కి పాల్పడ్డారని ఆరోపణలతో ఈ ఏడాది జనవరి 31న ఈడి అరెస్ట్ చేసింది. ప్రస్తుతమైన రాంచీలో బిర్సాముండా జైల్లో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో హేమంత్ సోరెన్ బెయిల్ పిటిషన్ మీద స్పందించడానికి ఈడీకి ఇంకో వారం ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.