జైల్లో కేజ్రీవాల్‌ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!

-

లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తిహాడ్‌ జైల్లో జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఆయన్ను కలిసి మాట్లాడేందుకు సీఎం సతీమణి సునీత అనుమతి కోరగా అధికారులు అంగీకరించలేదని ఆప్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఆప్‌ నేత ఆతిశీకి అనుమతినిచ్చిన నేపథ్యంలో సునీత అభ్యర్థనను తిరస్కరించామని జైలు అధికారులు చెప్పారని వెల్లడించాయి.

దిల్లీ మంత్రి ఆతిశీ ఈరోజు సీఎంతో మాట్లాడనున్నారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ కూడా మంగళవారం రోజున తిహాడ్‌ జైలుకు వెళ్లి కేజ్రీవాల్‌ను కలవనున్నారు. ఈ రెండ్రోజులు ఇద్దరికి అనుమతిచ్చిన నేపథ్యంలో మంగళవారం తర్వాతే సునీతను అనుమతించనున్నట్లు జైలు అధికారిక వర్గాలు చెబుతున్నాయని ఆప్ వర్గాలు తెలిపాయి. అయితే, నిబంధనల ప్రకారం వారంలో రెండుసార్లు మాత్రమే ములాఖత్‌కు అనుమతి ఉండటంతో భర్తను చూసేందుకు సునీతకు వచ్చేవారమే అనుమతి లభించనుంది. జైల్లో ఉన్న వ్యక్తితో ఒకేసారి ఇద్దరు వ్యక్తులు మాట్లాడే వీలుందని, అయినప్పటికీ తిహాడ్ అధికారులు సునీతను అనుమతించడం లేదని ఆప్‌ నేతలు ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news