మోదీ ప్రధానిగా ఉంటేనే దేశం భద్రం : ఎంపీ అర్వింద్

-

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ గడవు సమీపిస్తుండటంతో బీజేపీ ఎంపీ అభ్యర్థులు ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. ముఖ్యంగా సిట్టింగ్ ఎంపీలు ఎలాగైనా మరోసారి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే ఛాయ్ పే చర్చా, ఇంటింటి ప్రచారం వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నారు. ఈ క్రమంలోనే నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు.

ఈరోజు ఆయన జగిత్యాల జిల్లా తుంగూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉంటేనే దేశం భద్రంగా ఉంటుందని ఉద్ఘాటించారు. మరోసారి బీజేపీకి ఓటేసి మోదీని గెలిపించాలని ప్రజలను కోరారు. 15వ సారి పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్‌ రెడ్డికి ఇవే చివరి ఎన్నికలంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. గల్ఫ్‌ కార్మికుల గోసకు కాంగ్రెస్సే కారణమని ధర్మపురి అర్వింద్‌ మండిపడ్డారు. ఇన్నాళ్లూ వారి సమస్యలపై స్తబ్ధుగా ఉన్న హస్తం నేతలు ఎన్నికలు రాగానే గల్ఫ్ బోర్డు అని కొత్త రాగం ఎత్తుకున్నారని ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news