నా మీద పోటీ చేస్తే కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు తన మీద అవాక్కులు పేల్చడం సిగ్గుచేటని ఆయన వ్యవహార శైలిని చూసి సొంత పార్టీ నేతలే భయపడిపోతున్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపి బండి సంజయ్ అన్నారు. మే 8న ప్రధాని మోడీ వేములవాడ పర్యటనకి వస్తున్న నేపథ్యంలో మంగళవారం వేములవాడ పట్టణంలో మోడీ పర్యటన సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి బండి సంజయ్ వచ్చారు పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీ మీద హాట్ కామెంట్స్ చేశారు 6 గ్యారంటీల మీద కాంగ్రెస్ బండారాన్ని ప్రజలు గమనించే ప్రచారంలో పార్టీ నేతలను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని అందుకని ఆరు గ్యారెంటీ ల మీద అడిగితే తను మాట్లాడలేనని రేవంత్ రెడ్డి చెప్తున్నారని దీనిబట్టే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.