తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పలు కీలక నిర్ణయాలను తీసుకుంటుంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ఒక్కోక్కటిగా పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. తాజాగా అంగన్ వాడి సిబ్బందికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
రాష్ట్ర ప్రభుత్వం అంగన్ వాడి టీచర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్ వాడి కేంద్రాల్లో టీచర్లు, సహాయకులకు పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లగా నిర్ణయించింది. ఈ మేరకు సంబంధిత వివరాలను పంపాలని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ ఆదేశించారు. ముఖ్యంగా సిబ్బంది పుట్టిన తేదిని స్కూల్ బోనఫైడ్ సర్టిఫికేట్ లేదా టీసీ, పదోతరగతి మెమో ఆధారంగా పరిగణలోకి తీసుకోనున్నట్టు సమాచారం. ఒకవేళ టీసీ, మెమో, బోనఫైడ్ లేనియెడల వైద్య ధ్రువీకరణ పత్రం సమర్పించాలని పేర్కొంది.