టాలీవుడ్ యంగ్ నారా రోహిత్ కాస్త గ్యాప్ తర్వాత ప్రతినిధి-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. జర్నలిస్ట్ మూర్తి దేవగుప్త ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మే 10వ తేదీన థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా రిలీజ్ ట్రైలర్ విడుదలైంది. సీఎంను ఎందుకు చంపాలనుకున్నావ్.. నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అంటూ ఓ వ్యక్తి నారా రోహిత్‌ను ప్రశ్నించడంతో ట్రైలర్ మొదలైంది. ప్రతోడు కెమెరా ఒకటి కొనేయడం.. వీడియోలు చేసేయడం.. యూట్యూబ్ ఛానెల్లో పెట్టేయడం అంటూ రఘుబాబు చెప్పిన డైలాగ్ ఇంట్రెస్టింగ్గా ఉంది.
పవర్ మన చేతిలో ఉంటే కేసులన్నీ కోర్టులోనే ఉంటాయి.. మనల్నెవడు ఏం చేస్తాడు అంటూ ఈ సినిమాలో ఓ పాత్ర చెప్పిన డైలాగ్ ఈ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. దేశాన్ని కాపాడటానికి ఓ సైనికుడు.. కడుపు నింపడానికి ఓ రైతు ఎంత ఇంపార్టెంటో.. సొసైటీకి జర్నలిస్టు కూడా అంతే ఇంపార్టెంట్ అంటూ నారా రోహిత్ చెప్పిన డైలాగ్ కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది.