Kolkata Knight Riders won by 18 runs: ఇండియన్ ప్రీమియర్ 2024 టోర్నమెంట్లో చాలా సులభంగా గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతులెత్తేసింది. కేకేఆర్ జట్టు పై 18 పరుగుల తేడాతో ఓడిపోయింది ముంబై ఇండియన్స్. నిన్న వర్షం కారణంగా 16 ఓవర్లకు ఎంపైర్లు మ్యాచ్ను కుదించారు. దీంతో… నిర్నిత 16 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 157 పరుగులు చేసింది కేకేఆర్.
అయితే ఇంత తక్కువ లక్ష్యాన్ని చేదించడంలో ముంబై ఇండియన్స్ దూరంగా దారుణంగా విఫలమైంది. నిర్ణీత 16 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 139 పరుగులు మాత్రమే చేసింది ముంబై ఇండియన్స్. దీంతో 18 పరుగుల తేడాతో దారుణంగా ఓడిపోయింది ముంబై. ముంబై బేటాలలో ఈశాన్ కిషన్ మరియు తిలక్ వర్మ మినహా ఏ ఒక్క బ్యాట్స్మెన్ రానించలేదు. హార్దిక్ పాండ్యా రెండు పరుగులకు అవుట్ అయి మరోసారి నిరాశపరిచాడు. అటు ఈ మ్యాచ్లో గెలిచిన కేకేఆర్ నేరు గా ప్లే ఆఫ్ వెళ్ళింది.