సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలో మూడు రోజులుగా కరెంట్ లేకపోవడంతో ఓట్లు వేయకుండా ధర్నా చేస్తున్నారు ఓటర్లు. మూడు రోజుల నుంచి గూడెంలో కరంట్ లేకపోవడంతో చెంచులు ఓట్లు వేయకుండా ఆందోళన చేపట్టిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచు గూడెం చెంచులు ఓట్లు వేయకుండా బహిష్కరించి ఆందోళన చేపట్టారు.

గత మూడు రోజుల నుంచి కరెంట్ లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. చెంచులమని మమ్ములను ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. మా గ్రామానికి రోడ్డు సౌకర్యం, మంచినీటి వసతి, రేషన్ కార్డులు లాంటి సమస్యలు ఉన్నా ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. నల్లమల ప్రాంతం కావడంతో పాములు వస్తున్నాయి, కరెంట్ లేకపోవడంతో పాము కాటుకు గురి కావాల్సివస్తుందని తెలిపారు.