సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు తాము సాధించిన స్కోరును cbse.gov.in, https://cbseresults.nic.in/ వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. రోల్ నంబర్, పుట్టిన తేదీ, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డు నంబర్‌లను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. డిజీలాకర్, ఉమాంగ్ మొబైల్ యాప్‌ల ద్వారా కూడా రిజల్ట్స్ పొందొచ్చు.
ఈ ఏడాది 12వ తరగతిలో మొత్తం 87.98శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. 91.52శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలు 85.12శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. 1.16లక్షల మంది విద్యార్థులకు 90శాతం కంటే ఎక్కువ మార్కులు రాగా 24,068 మంది విద్యార్థులు 95శాతానికి పైగా స్కోరు సాధించినట్లు బోర్డు తెలిపింది. అత్యధికంగా తిరువనంతపురంలో 99.91శాతం, విజయవాడలో 99.04శాతం, చెన్నైలో 98.47శాతం, బెంగళూరులో 96.95శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించింది. ఈ ఏడాది 12వ తరగతిలో మొత్తం 87.98 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 91శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలు రాణించారు.