ఏపీలో ఎన్నికల వేళ రూ.17 వేల కోట్ల అప్పులు

-

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే విపరీతమైన అప్పులు పుట్టిస్తుండగా.. ఏప్రిల్లోనూ ఈ పంథా కొనసాగింది. సాధారణంగా ఎన్నికల సమయంలో సాధారణ ఖర్చులకు తప్ప ఇతరత్రా ఏ అవసరాలూ ఉండవు. కానీ ఈ ఏడాది ఏప్రిల్‌ 1 తర్వాత ఇంతవరకు 44 రోజుల్లో రూ.17 వేల కోట్ల మేర బహిరంగ మార్కెట్‌ రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. వీటితో పాటు వేస్‌ అండ్‌ మీన్స్‌ వెసులుబాటు కింద రిజర్వ్‌బ్యాంక్‌ కల్పించే అవకాశాలు ఉపయోగించి రూ.వేల కోట్ల అప్పు తెచ్చి అవసరాలు తీరుస్తోంది.

మే 14న రిజర్వుబ్యాంకు నిర్వహించిన వేలంలో రూ.4,000 కోట్ల రుణం సమీకరించడంతో ఇంతవరకు 44 రోజుల్లో రూ.17వేల కోట్లు ఇలా తీసుకున్నట్లయింది. తొమ్మిదేళ్లలో తీర్చేలా రూ.500 కోట్లు 7.45% వడ్డీకి, 16 ఏళ్లలో తీర్చేలా 7.45% వడ్డీకి మరో రూ.500 కోట్లు తీసుకున్నారు. రూ వెయ్యి కోట్ల చొప్పున 21, 23, 23 ఏళ్లలో చెల్లించేలా 7.42, 7.41% వడ్డీకి మరో రూ.3,000 కోట్ల అప్పు తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news