గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు

-

వరంగల్‌- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు ఉమ్మడి జిల్లాల పరిధిలో తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. 2021లో ఎమ్మెల్సీగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దాంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌ నుంచి చింతపండు నవీన్‌, బీఆర్​ఎస్​ నుంచి ఏనుగుల రాకేశ్‌ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి పోటీలో ఉన్నారు. వీరితో పాటు మొత్తం 52 మంది బరిలో నిలిచారు.

 

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డిగ్రీ పూర్తి చేసిన వారికే ఓటు హక్కు ఉంటుంది. చదువుకున్న వారు అయినప్పటికీ గడిచిన ఎన్నికల్లో 21,636 ఓట్లు చెల్లలేదు. సాధారణ ఓటు హక్కు మాదిరిగా కాకుండా పట్టభద్రులు ప్రాధాన్య క్రమంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. అంటే పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటెయ్యాలి.

Read more RELATED
Recommended to you

Latest news