అనంతపురం జిల్లా రాయదుర్గంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సోయేల్‌ను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులతో అతడికి సంబంధాలు ఉన్నట్టు ఎన్‌ఐఏ అధికారులకు సమాచారం అందుకున్నారు.రాయదుర్గం పట్టణంలోని ఆత్మకూర్ వీధికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ గఫూర్‌కు ఇద్దరు కుమారులు. బెంగళూరులో నివాసముంటున్న వారిలో ఒకరైన సోయేల్‌కు ఉగ్రవాదులతో సంబంధాలున్నట్టు ఎన్‌ఐఏ గుర్తించడంతో అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా రాయదుర్గంలో 3 రోజులుగా రెక్కీ నిర్వహించారు.
ఎవరికీ అనుమానం రాకుండా ఎన్‌ఐఏ అధికారులు వచ్చి గఫూర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. సాయుధ దళాల సాయంతో సాయేల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతన్ని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి విచారించారు. అనంతరం కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్ఐఏ అధికారులు ప్రత్యేక వాహనంలో బెంగళూరు తరలించారు. సోయేల్‌ను అరెస్టు చేసినట్టు కుటుంబ సభ్యులకు ధ్రువీకరణ పత్రం అందజేశారు.ఫోన్ ద్వారా సోయేల్ ఉగ్రవాదులతో మాట్లాడినట్టు ఆధారాలు లభించాయని తెలుస్తోంది.