దక్షిణ కొరియాలోకి నార్త్ కొరియా చెత్త బాంబులు

-

దక్షిణ కొరియా కార్యకర్తలు ఉత్తర కొరియా భూ భాగంలో కరపత్రాలు వెదజల్లినందుకు ఆ దేశం ప్రతీకారం తీర్చుకుంది. తమ భూభాగంలో కరపత్రాలు వెదజల్లినందుకు ప్రతిగా ఉత్తర కొరియా మంగళవారం రాత్రి నుంచి బెలూన్ల ద్వారా దక్షిణ కొరియాలోకి చెత్త, మురికి మట్టిని పంపింది. బుధవారం మధ్యాహ్నానికి దాదాపు 260 ఉత్తర కొరియా బెలూన్లు తమ భూభాగంలోని వివిధ ప్రాంతాల్లో వ్యర్థాలను జార విడిచాయని దక్షిణ కొరియా సైనిక వర్గాలు వెల్లడించాయి.

బెలూన్లు, అవి విడిచిన వస్తువులనూ, పదార్థాలనూ తాకవద్దనీ, వాటి గురించి పోలీసులకు కానీ, సైన్యానికి కానీ తెలపాలని పౌరులకు అధికార వర్గాలు సూచించాయి. దేశమంతటా రోడ్ల వెంబడి బెలూన్లు జారవిడచిన చెత్త చెల్లాచెదురుగా పడి ఉంది. మరోవైపు రాజధాని సియోల్‌లో పడిన బెలూన్‌లో ఒక టైమర్‌ కనిపించగా.. అది బెలూన్‌ను పేల్చడానికి ఉపయోగించిన టైమర్‌ అని దక్షిణకొరియా అధికారులు తెలిపారు. ఈ చెత్తలో ప్రమాదకర పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయేమో ఆరా తీయడానికి నిపుణుల బృందాలను నియమించారు.

Read more RELATED
Recommended to you

Latest news