మూవీ లవర్స్కు గుడ్ న్యూస్.. రేపు ₹99కే మల్టీఫ్లెక్స్‌లో సినిమా చూసే ఛాన్స్

-

మూవీ లవర్స్కు థియేటర్ల యాజమాన్యం బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ప్రేక్షకులను ఆకర్షించేందుకు వినూత్న ఆఫర్లు ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా సినిమా టికెట్‌ ధరల్ని తగ్గించింది. మే 31వ తేదీన ‘సినిమా లవర్స్‌ డే’ సందర్భంగా కేవలం ₹99కే సినిమా చూసే సదుపాయాన్ని కల్పిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్ పీవీఆర్‌ ఐనాక్స్‌, సినీ పోలిస్ ఇండియా, మిరాజ్‌ సినిమాస్‌, మూవీ మ్యాక్స్‌ సహా ప్రధాన మల్టీప్లెక్స్ చెయిన్‌లలో అందుబాటులో ఉంటుంది.

ఈ సదుపాయం దేశవ్యాప్తంగా ఉన్న 4,000 స్క్రీన్‌లలో అందుబాటులో ఉంటుందని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) అధిపతి, PVR ఐనాక్స్ పిక్చర్స్ సీఈఓ కమల్ జియాంచందానీ తెలిపారు. ప్రీమియం సీట్లు మినహా మిగిలిన 90 శాతం సీట్లకు ఈ ఆఫర్‌ వర్తిస్తుందని అన్నారు.

గమనిక: రెక్లెయినర్స్‌, ప్రీమియం ఫార్మాట్లకు ఈ అవకాశం లేదు. ఎంపిక చేసిన నగరాల్లోని కొన్ని థియేటర్లకే ఈ ఆఫర్‌ వర్తించనుంది. కేవలం ఒక్కరోజే. ఆన్‌లైన్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేస్తే అదనపు ఛార్జీలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news