పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలల్లో తీన్మార్ మల్లన్న విజయం ఖరారు ఐంది. ఈ నేపథ్యంలోనే పట్టభద్రుల బిఆరెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. సాంకేతికంగా ఎమ్మెల్సీగా ఓడిపోయినా నైతికంగా విజయం నాదే. రాష్ట్రంలో మూడు జిల్లాల్లో కాంగ్రెస్ బలంగా ఉంది అయినా సరే గట్టి పోటీ ఇచ్చామన్నారు. శాసనమండలి చట్ట సభల్లో అడుగు పెట్టలేకపోతున్నా.. జన సభలో ప్రజల తరుపున ప్రభుత్వంతో పోరాటం చేస్తానని పేర్కొన్నారు.
అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు నేను గెలవాలని కోరుకున్నారు. జేడీ లక్ష్మి నారాయణ లాంటి వారు నాకు మద్దతు తెలిపారన్నారు పట్టభద్రుల బిఆరెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి. పన్నెండు ఏళ్లుగా ప్రజల కోసం పని చేస్తున్నాను. బిఆరెస్ పార్టీ నాయకులందరు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. బిఆరెస్ శ్రేణులు పోరాట పటిమ చూపించారని వెల్లడించారు. మూడు లక్షల ముప్పై ఆరు వేల ఓట్ల లో నాకు లక్షా ముప్పై ఐదు వేల ఓట్లు వేశారు. ఊపిరి వున్నంతవరకు పట్టభద్రుల కొరకు ప్రజా క్షేత్రంలో పోరాడుతానని ప్రకటించారు పట్టభద్రుల బిఆరెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి.