T20 World Cup 2024: సూపర్ 8 లో ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసిన టీమిండియా

-

టి20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్లో టీమ్ ఇండియా దూసుకు వెళ్తోంది. గ్రూప్ స్టేజిలో దుమ్ము లేపిన టీమిండియా.. ఇప్పుడు సూపర్ 8 లో కూడా అదరగొడుతోంది. గురువారం ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై టీమిండియా 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేసింది.

India won by 47 runs

టీమిండియా జట్టులో… సూర్య కుమార్ యాదవ్ 53 పరుగులు, కోహ్లీ 24, కీపర్ పంత్ 20 పరుగులు, హార్దిక్ పాండ్యా 32 పరుగులు చేసి రాణించారు. ఇక అనంతరం బ్యాటింగ్ ఒక దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు కేవలం 134 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఒక్క బ్యాట్స్మెన్ కూడా సరిగా ఆడక పోవడంతో… 47 పరుగుల తేడాతో ఓడిపోయింది ఆఫ్గానిస్తాన్. ఇక టీమ్ ఇండియా బౌలర్లలో హర్షదీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా బుమ్రా కూడా 3 వికెట్లు తీశారు. అటు కుల్దిప్‌ యాదవ్ రెండు వికెట్లు అక్షర పటేల్ ఒకటి మరియు రవీంద్ర జడజాకు ఒకటి పడింది.

Read more RELATED
Recommended to you

Latest news