మేడిగడ్డ బ్యారేజీతో తెలంగగాణ రాష్ట్రానికి రూ. 800 కోట్ల పైన లాభం రానుందట. ఆ ఆదాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అర్జించనుందని సమాచారం. మేడిగడ్డలో ఇసుక అమ్మకం ద్వారా భారీగా ఆదాయం వస్తోందని సమాచారం అందుతోంది. మేడిగడ్డ ఇసుక తవ్వకాలకు భారీగా గుత్తేదారులు పోటీ పడుతున్నారట. 14 బ్లాకులకు 383 బిడ్లు వేశారట. మేడిగడ్డలో నీటిని ఖాళీ చేయడంతో పెద్ద ఎత్తున ఇసుక బయటపడింది. దీంతో ఈ ఇసుకను తవ్వి తీసి విక్రయించడానికి ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది.
బ్లాకుల నుండి ఇసుకను తవ్వి తీసి నిల్వ కేంద్రాలకు పంపి, అక్కడ ఇసుక కొనే లారిలోకి ఇసుకను నింపాలి.. ఈ ప్రక్రియకు టన్నుకు రూ.97 చెల్లిస్తామని టీజీఎండీసీ టెండర్లను ఆహ్వానించగా 383 టెండర్లు వచ్చాయి. ఇందులో మూడు బ్లాకుల్లోనే 10 లక్షల టన్నుల ఇసుక పరిమాణం ఉండగా, ఈ మూడు బ్లాకులకు ఇసుక తీయడానికి రెండేళ్ల సమయం, మిగతా 11 బ్లాకులకు ఏడాదిన్నర సమయం ఇచ్చారు. ఈ లెక్కన మేడిగడ్డ బ్యారేజీతో తెలంగగాణ రాష్ట్రానికి రూ. 800 కోట్ల పైన లాభం రానుందట.