చెత్త రికార్డు మూటగట్టుకున్న టీమిండియా

-

వారం క్రితం వరల్డ్ ఛాంపియన్గా నిలిచినటీమిండియా.. నేడు జింబాబ్వే చేతిలో చిత్తయింది. సీనియర్లు లేకుండా బరిలోకి దిగిన కుర్రాళ్లు.. 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడ్డారు. అంతర్జాతీయ టీ20ల్లో టీమ్ ఇండియాపై ప్రత్యర్థి డిఫెండ్ చేసుకున్న అత్యల్ప లక్ష్యం ఇదే. 2016లో న్యూజిలాండ్ నిర్దేశించిన 127 పరుగుల లక్ష్యాన్ని, 2009లో SA చేసిన 131 పరుగులను భారత్ ఛేదించలేకపోయింది.

కాగా, ఈ మ్యాచ్ లో భారత్ 13 రన్స్ తేడాతో ఓడిపోయింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక 102 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ గిల్ (31) రన్స్ చేయగా.. మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. అభిషేక్, రింకూ డకౌట్ కాగా.. అవేశ్ 16, బిష్ణోయ్ 9, రుతురాజ్ 7, జురెల్ 7, పరాగ్ 2 పరుగులు చేశారు. చివర్లో సుందర్ 27 పరుగులు చేసినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో 5 టీ20ల సిరీస్లో జింబాబ్వే 1-0తో ఆధిక్యం సాధించింది.కాగా, మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 115 రన్స్ చేసింది. క్లైవ్ మదాండే(25 నాటౌట్) 3 పోరాటంతో ఆ జట్టు 100 రన్స్ చేసింది. డియోన్ మైయర్స్ (23), బ్రియాన్ బెన్నెట్(23), వెస్లీ మాథెవెరే(21), కెప్టెన్ సికందర్ రజా(17) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. నలుగురు ప్లేయర్లు డకౌట్ అయ్యారు.టీమిండియా బౌలర్లలో రవి బిష్ణోయ్ 4 వికెట్లు, సుందర్ 2, అవేశ్, ముకేశ్ తలో వికెట్ల తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news