Business Idea : ప్రస్తుతం మన ఆర్థిక అవసరలు, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో కచ్చితంగా రెండు చేతుల నిండా సంపాదించాల్సిన పరిస్థితి నెలకొంది. కేవలం ఒక పని మీద ఆదాయం సరిపోని పరిస్థితి ఉంది. అందుకే మనలో చాలా మంది కూడా ఇతర ఆదాయల కోసం ఎంతగానో అన్వేషిస్తున్నారు. ఇందుకోసం కేవలం చేస్తున్న ఉద్యోగాల పైనే ఆధార పడకుండా వ్యాపారాన్ని చాలా మంది అదనపు ఆదాయం కోసం ఎంచుకుంటున్నారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు వ్యాపారాన్ని చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు చాలా మంది. ఇక గృహిణిలు కూడా ఇంట్లో ఉంటూనే ఎన్నో ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇలాంటి వారి కోసం ఎన్నో వ్యాపారాలు మనకు అందుబాటులో ఉన్నాయి.అలాంటి ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రస్తుతం దూద్ కప్స్కు మార్కెట్లో భారీగా డిమాండ్ నెలకొంది. చాలా మంది ఇళ్లలో కూడా ప్రతీ రోజూ ఈ దూప్ కప్స్‌ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పూజ గదిలో, ఇంకా టీ, కాఫీ, మిల్క్ లాంటివి తాగడానికి కచ్చితంగా దూప్ కప్స్ ఉండే పరిస్థితి ఉంది.మరి ఇంత డిమాండ్ ఉన్న ఈ దూద్ కప్స్ తయారి వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల కచ్చితంగా మంచి ఆదాయం పొందొచ్చు. ఇంతకీ ఈ దూప్ కప్స్ తయారీని ఎలా ప్రారంభించాలి? ఇందులో లాభాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.
ఇక దూప్ కప్స్ తయారీకి ఒక చిన్న మిషన్‌తో పాటు మూడి సరుకు కూడా చాలా అవసరపడుతుంది. పొడిలా ఉండే ముడి సరుకును మిషిన్‌లో వేసి నొక్కితే ఆ దూప్ కప్స్ అనేవి తయారవుతాయి. ఆ తరువాత అందులో కప్స్‌లో వేసే దూప్ను కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దూప్ కప్స్‌లో దూప్ను వేసిన తర్వాత వాటిని మంచిగా ప్యాకేజీ చేసి విక్రయించుకోవచ్చు. మార్కెట్లో మీ సొంత బ్రాండింగ్‌తో వీటిని ప్యాక్ చేసి అమ్ముకోవచ్చు. పైగా ఈ మిషిన్కు ఎలాంటి పవర్ కూడా అవసరం లేదు. ప్రస్తుతం మార్కెట్లో ఒక్కో దూప్ కప్స్ ప్యాకేట్ తక్కువలో తక్కువగా రూ. 50గా ఉన్నాయి. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం ద్వారా భారీగా లాభాలని సంపాదించవచ్చు.