‘మా’ పదవికి రాజీనామా చేసిన‌ రాజశేఖర్

-

మా అసోసియేషన్‌లో లొసుగులు మరోసారి బయటపడ్డాయి. తాజాగా జరిగిన మా డైరీ మీటింగ్ చాలా వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. అందులో రాజశేఖర్ మాటలు కూడా చాలా సీరియస్ అయ్యాయి. అయితే డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన హీరో రాజశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘మా’ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖ రాశారు. మా అధ్యక్షుడు నరేశ్ వైఖరి మనస్తాపం కలిగించిందని లేఖలో పేర్కొన్నారు.

అంతకుముందు హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజశేఖర్ తీవ్ర ఆగ్రహావేశాలతో ప్రసంగించారు. వేదికపై ఉన్న చిరంజీవి, మోహన్ బాబులు సైతం ఆగ్రహానికి గురయ్యేలా రాజశేఖర్ ప్రసంగం సాగింది. ఈ వివాద ఫలితంగానే రాజశేఖర్ ‘మా’ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. రాజశేఖర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చిరంజీవి డిమాండ్ చేసిన కాసేపటికే రాజశేఖర్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తి కలిగిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news