NTR University: నీట్ విద్యార్థులు షాక్.. సర్వర్లు డౌన్ !

-

NTR University: ఏపీలోని నీట్ విద్యార్థులు షాక్‌..MBBS BDS అడ్మిషన్లకు నోటిఫికేషన్ అప్లై చేసుకునే వారికి సాంకేతిక సమస్య వచ్చింది. MBBS BDS అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఎంబిబిఎస్ బిడిఎస్ అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. 2024-25 విద్యా సంవత్సరం కు సంబంధించి నీట్ క్వాలిఫై అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

NTR Health University released notification for MBBS BDS admissions

ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం నుండి On line లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టింది హెల్త్ యూనివర్సిటీ. ఈ నెల 16వ తేదీ వరకు గడువు ఉంటుందని అధికారులు ప్రకటించారు. అయితే… హెల్త్ యూనివర్సిటీ సర్వర్లు..పని చేయడం లేదు. హెల్ప్ లైన్ నెంబర్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. గడువు దాడితే అపరాధ రుసుము 20000 చెల్లించుకోవాల్సి వస్తుందంటున్నారు అభ్యర్థులు. మరి దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news