హాష్ ఆయిల్ సప్లై చేస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్..!

-

గంజాయి నుండి హాష్ ఆయిల్ తయారు చేసి సప్లై చేస్తున్న అంతరాష్ట్ర ముఠా సభ్యులు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. 1 కోటి 52 లక్షల రూపాయలు విలువ చేసే 10 లీటర్లు హాష్ ఆయిల్.. 19.2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నాము. హష్ ఆయిల్ సరఫరా చేస్తున్న నిందితులు గోవిందరావు మరియు రాంబాబు ఆంధ్ర ప్రదేశ్ చెందిన వారు. ఏపీ అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి హేష్ ఆయిల్ RTC బస్సులో తరలిస్తున్నారు.

అయితే ఈ సమాచారం అందడంతో వలపన్ని నిందితులను పటుకున్నం. వీరే హాష్ ఆయిల్ తయారు చేసి రవాణా చేసి ఇక్కడ విక్రయిస్తున్నారు. అయితే ఈ కేసులో గోవిందరావు & రాంబాబుకు సహకరించిన మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. మొత్తం 480 కేజీల గంజాయి మరిగించి 10 లీటర్లు హాష్ అయిల్ తయారు చేసారు అని కమిషనర్ సుధీర్ బాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news