మణిపూర్ లో శాంతిని నెలకొల్పేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తోంది – మోహన్ భగవత్

-

మణిపూర్ సంక్షోభంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. 1971లో కీలక నేత శంకర్ దిన్కర్ కానే (భయ్యాజీ) మణిపూర్ లో చేసిన సేవలను స్మరించుకుంటూ పూనేలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మణిపూర్ లో పరిస్థితి సంక్లిష్టంగా, సవాలుగా మారిందని అభివర్ణించారు.

ఈ పరిస్థితుల్లో కూడా ఆర్ఎస్ఎస్ వాలంటీర్లు ఈశాన్య రాష్ట్రంలో బలంగా నిలిచారన్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో భద్రతకు ఎటువంటి హామీ లేకుండా పోయిందన్నారు. స్థానికులే వారి సెక్యూరిటీ విషయంలో సందేహాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక వ్యాపారాలు, సేవా కార్యక్రమాల నిమిత్తం మణిపూర్ కి వెళ్లే వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది అన్నారు.

ఈ నేపద్యంలో అక్కడ శాంతిని నేలకొల్పేందుకు ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. సాధారణ ఎన్జీవోలు చేయలేని పనిని సంఘ్ చేస్తోందని వెల్లడించారు. మణిపూర్ లో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 200 మందికి పైగా మరణించారని, 60 వేల మంది నిరాశ్రయులు అయ్యారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news