‘దేవర’ మూవీ చూసేవరకైనా నా కొడుకును బతికించండి ప్లీజ్!

-

తన కొడుకును బతికించాలని కన్నతల్లి కన్నీరుమున్నీరవుతోంది. బ్లడ్ క్యాన్సర్‌‌తో బాధపడుతున్న తన కొడుకును ఎలాగైనా రక్షించాలని వైద్యులను వేడుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కౌశిక్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని. ప్రస్తుతం అతను మృత్యువుతో పోరాడుతున్నాడు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతూ బెంగళూరులోని కిడ్‌ వై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

అయితే, తాను బతకనని.. జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా విడుదలయ్యే వరకు తనకు బతికించాలని వైద్యులను కౌశిక్ వేడుకున్నాడు. కాగా, సెప్టెంబర్ 27వ తేదీన దేవర మూవీ విడుదల కానుంది. అయితే, తమ బిడ్డ చివరి కోరిక తీర్చాలని.. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ స్పందించాలని కౌశిక్ తల్లిదండ్రులు ప్రాధేయపడుతున్నారు. బ్లడ్ క్యాన్సర్ బారిన పడిన కౌశిక్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ఇప్పటికే చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే తన చివరి కోరిక తీర్చాలని బాధితుడు కౌశిక్, అతని పేరెంట్స్ వేడుకుంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news