మాజీ సీఎం జగన్ ట్వీట్‌కు మంత్రి నారా లోకేశ్ కౌంటర్!

-

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్ విధానాన్ని రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీంతో మాజీ సీఎం జగన్ ఏపీ ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని, వారి పొట్ట కొడుతున్నారని విమర్శిస్తూ ట్వీట్ చేశారు.తాజాగా దానికి కౌంటర్‌గా నారా లోకేశ్ మరో ట్వీట్ చేశారు.ఇందులో మాజీ సీఎం జగన్ మీద సెటైరికల్ కామెంట్స్ చేశారు.

‘ఏం చదివావో తెలియదు..ఎక్కడ చదివావో అస్సలు తెలియదు..నువ్వు విద్యాశాఖ గురించి లెక్చర్ ఇవ్వడం వింతగా ఉంది ఫేకు జగన్! కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం మీరు తీసుకున్న నిర్ణయం 1000 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారింది. సీబీఎస్ఈ విధానంలో పరీక్షలు రాయడానికి అవసరమైన సామర్థ్య పెంపు, ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే పరీక్షా విధానం మార్చడం వలన పదో తరగతి చదువుతున్న 75వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆత్మలతో కాకుండా నిపుణులతో చర్చించి వచ్చే విద్యా సంవత్సరం 6వ తరగతి నుండే పరీక్షా విధానంలో మెల్లగా మార్పులు తీసుకొచ్చి సీబీఎస్ఈలో పరీక్షలు రాసేందుకు సిద్ధం చేస్తాం. గుడ్లు, చిక్కి, ఆఖరికి ఆయమ్మల జీతాలు కూడా బకాయి పెట్టి పోయిన కంస మామ అయిన మీరు ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాను అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది.అన్నట్టు మీరు అంత ఉద్దరిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గినట్టో సెలవివ్వండి’ అంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news