హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది.నేటి ఉదయం నుంచే వాతావరణం చల్లగా ఉన్నది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం దంచికొడుతుంది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరద నీరు చేరింది. నగరంలోని ప్రధాన కూడళ్లలోని రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. మోకాళ్లలోతు నీరు నిలిచి పోవడంతో బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్దఅంబర్‌పేట్, అబ్దుల్లాపూర్‌మెట్,మియాపూర్, కూకట్ పల్లి, కేపీహెచ్‌బీ, బాలానగర్, అమీర్ పేట, పంజాగుట్ట, ఎర్రగడ్డ, హైటెక్ సిటీ, లింగంపల్లి తదితర ప్రాంతాలలో మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల ట్రాఫిక్ భారీగా నిలిచిపోవడంతో వాహన దారులు నరకం అనుభవిస్తున్నారు.అయితే, వరద నిలిచిన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాచక చర్యలు చేపడుతున్నారు.