KTR: హైడ్రా బాధితులకు…మేం కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వండి

-

హైడ్రా బాధితులకు…మేం కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వండి అని కోరారు కేటీఆర్. హైదరాబాద్ నగరంలో ఎక్కడ పేదల ఇల్లు కూలకొట్టినా.. హైదరాబాద్ నగరంలో మేం కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వండి అన్నారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభించిన ఎస్టీపీలను బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని పార్టీ నేతల బృందం సందర్శించింది.

A group of party leaders under the leadership of BRS President KTR visited the STPs which were started under the BRS government in Hyderabad

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరాన్ని పూర్తి మురుగునీటి రహిత నగరంగా మార్చే ప్రయత్నం చేశామని తెలిపారు. కేసీఆర్ దృఢ సంకల్పం, ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. ఈరోజు కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ ఎస్టీపీని మా పార్టీ బృందం సందర్శించింది… ఎస్టీపీల సందర్శనల్లో ఇది మొదటి అడుగు మాత్రమే.. మిగిలిన ఎస్టీపీలను కూడా సందర్శిస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news