బస్సు-ట్రక్కు ఢీ..ఆరుగురు మృతి,20 మందికి గాయాలు

-

మధ్యప్రదేశ్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మైహర్ జిల్లాలో శనివారం అర్దరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రయాగ్‌రాజ్ నుంచి నాగ్‌పూర్‌కు ప్రయాణికులతో బయలు దేరిన ట్రావెల్ బస్సు.. నదన్ దేహత్ సమీపంలోకి రాగానే ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చి ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మొత్తం ఆరుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందగా.. దాదాపు 20 మందికి గాయాలయ్యాయి.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని మైహర్ పోలీసు సూపరింటెండెంట్ సుధీర్ అగర్వాల వెల్లడించారు. బాధిత ప్రయాణికుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news