IND vs BAN, 2nd Test India breaks record for fastest team fifty in Test cricket: టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండవ టెస్ట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇవాల్టి వరకు వర్షం అడ్డంకిగా నిలిచింది. గత మూడు రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. అయితే ఇవాళ ఉదయం మ్యాచ్ ప్రారంభమైంది.

అయితే కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో 233 పరుగులకు తొలి ఇన్నింగ్స్ లో బంగ్లాదేశ్ ఆల్ ఓట్ అయింది. బంగ్లాదేశ్ బ్యాటర్ మోమినల్ హాక్ ఒక్కడే 107 పరుగులతో… జట్టును ఆదుకున్నాడు. అటు టీమిండియా బౌలర్లలో బుమ్రా 3, సిరాజ్, అశ్విన్, అకాష్ దీప్ తలో రెండు వికెట్లు తీశారు. ఇక మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. దూసుకెళుతోంది. టీ 20 మ్యాచ్ తరహాలోనే రోహిత్ శర్మ హిట్టింగ్ ఆడుతున్నాడు. ప్రస్తుతం మొదటి ఇన్నింగ్స్ లో 50 పరుగుల దాటిన టీమిండియా.. వికెట్ నష్టపోలేదు.