BREAKING: బాలీవుడ్‌ నటుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు

-

Actor Govinda hospitalised after accidental gunshot injury: ముంబైలో కాల్పుల కలకలం. బాలీవుడ్ నటుడు గోవిందా కు బుల్లెట్ గాయాలు అయ్యాయి. బాలీవుడ్ నటుడు గోవిందా కాలులోకి ఒక్కసారిగా బుల్లెట్ దూసుకు వెళ్ళింది. దీంతో గోవిందా కు తీవ్ర గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. గన్ క్లీన్ చేస్తుండగా… ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మూలకు ఉన్న గన్ తీసి… బాలీవుడ్ నటుడు గోవిందా చెక్ చేస్తున్నారట.

Actor Govinda hospitalised after accidental gunshot injury

ఈ తరుణంలోనే ఆ గన్ ప్రమాదవశాత్తు పేలింది. ముంబైలో ఇంటి నుంచి బయలుదేరే సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ బుల్లెట్ గాయాలు తగిలినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. వెంటనే ఆయన సిబ్బంది… గోవిందా ను ముంబైలోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం… క్రిటికల్ గానే ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news